ప్రపంంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఇఒ..
ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లలో టెస్లా, స్పెస్ ఎక్స్ సిఇఒ ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మేరకు 2021 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం భారీ వేతనం పొందే 10 మంది సిఇఓలలో మస్క్ నంబర్ 1 స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో ఆపిల్ సిఇఒ టిమ్ కుక్, నెట్‌ఫ్లిక్స్ సిఇఓ రీడ్ హ్యాస్టింగ్, మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల ఉన్నారు. 2021లో మాస్క్ పొందిన పరిహారం 23.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఫార్చ్యున్ 500 జాబితాలో టెస్లా 65వ స్థానంలో ఉంది. కంపెనీ 2021 లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, సంస్థ ఆదాయం 71 శాతం పెరిగి 53.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ తర్వాత రెండో స్థానంలో ఆపిల్ 2021 సంవత్సరంలో 770 మిలియన్ డాలర్లు సంపాదించారు. దీనిలో 10 ఏళ్ల 1.7 బిలియన్ డాలర్ల షేర్ల గ్రాంట్‌లో ఉంది. ఈ టెక్ దిగ్గజం ఫార్చ్యూన్ 500 జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది.






