ట్విట్టర్ ఉద్యోగులకు భారీ షాక్
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చారు. మరోసారి ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్స్ తర్వాత పనిచేసే ఉద్యోగులకు అందించే ప్రోత్సహాకాలపై కోత విధించనున్నట్లు తెలిసింది. ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ ఉద్యోగులకు ఇంట్రర్నల్ మెమో పంపించినట్లు తెలుస్తోంది. ఆ నోటీసుల్లో ఉద్యోగుల పనితీరు గమనించేందుకు వారం వారం వర్క్ రిపోర్ట్ అందించాలని తెలిపారు. టెక్నికల్ టీం ఉద్యోగులు వారి చేసిన శాంపిల్ వర్క్, నాన్ టెక్నికల్ ఉద్యోగులు విధులకు సంబంధించిన సమ్మరీని అందించాలని మస్క్ ఆదేశించినట్లు ది వెర్జ్ డిప్యూటీ ఎడిటర్ అ హీత్కు అందిన మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.






