అమెరికా మార్కెట్ లోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా అమెరికా మార్కెట్లో వల్సర్టాన్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. అధిక రక్తపోటు, హృద్రోగ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. డయోవాన్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. ఈ ఔషధానికి సంబంధించి బ్రాండెడ్, జనరిక్ మార్కెట్ విలువ గడిచిన ఏడాది కాలంలో సుమారు 150 మిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు ట్రూస్టుజుమాబ్ (హెచ్డీ201) ఔషధాన్ని లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో సరఫరా, విక్రయాల కోసం సింగపూర్‌కి చెందిన ప్రెస్టీజ్ బయోఫార్మాతో డీఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించేందుకు ఉపయోగిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ కొరియాలోని ఒసాంగ్ ప్లాంటు నుంచి ప్రెస్టీజ్ బయోఫార్మా హెచ్డీ 201 ఔషధాన్ని డీఆర్ఏల్కు అందిస్తుంది.






