అమెరికా న్యాయస్థానంలో డాక్టర్ రెడ్డిస్ కు ఊరట
రెవ్లీమిడ్ అనే ఔషధానికి సంబంధించి, అమెరికాలో తలెత్తిన న్యాయ వివాదాన్ని డాక్టర్ రెడ్డీస్ పరిష్కరించుకుంది. మల్టిపుల్ మైలోమా అనే కేన్సర్ వ్యాధికి చికిత్సలో ఈ మందు వినియోగిస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో జిల్లా న్యాయస్థానంలో డాక్టర్ రెడ్డీస్‌తో పాటు పలు జనరిక్ మందుల తయారీ కంపెనీలు, రెవ్లీమిడ్ ఔషధాన్ని మార్కెట్ చేస్తున్న సెల్జీన్, బీఎంఎస్ ( బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్) పై యాంటీ ట్రస్ట్ లిటిగే షన్ నవంబరులో దాఖలైంది. ఈ కంపెనీలన్నీ కలిసి ఏకస్వామ్యాన్ని స్ఫష్టించి రెవ్లీమిడ్ మందు ధరను సరఫరాను నియంత్రిస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. తాజాగా ఈ వివాదం నుంచి డాక్టర్ రెడ్డీస్‌ను ఫిర్యాదుదార్లు స్వచ్ఛందంగా తొలగించారు. ఇదే విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.






