డాక్టర్ రెడ్డీస్ కు షాక్.. అమెరికా కోర్టులో
ఒక కేన్సర్ ఔషధం విషయంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌పై అమెరికా కోర్టులో యాంటీ ట్రస్ట్ లిటిగేషన్ దాఖలైంది. ఇందులో డాక్టర్ రెడ్డీస్‌తో పాటు సెల్జీన్, బ్రిస్టల్ మేర్స్ స్క్విబ్ వంటి మరికొన్ని జనరిక్ ఔషధ కంపెనీలున్నాయి. రెవ్లీమిడ్ అనే ఔషధానికి సంబంధించి న్యూజెర్సీ జిల్లా న్యాయస్థానంలో ఈ నెల 18న తమతో పాటు మరికొన్ని కంపెనీలపై యాంటీ ట్రస్ట్ లిటిగేషన్ దాఖలైనట్లు డాక్టర్ రెడ్డీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఈ ఔషధాన్ని మల్టిపుల్ మైలోమా అనే కేన్సర్ వ్యాధికి చికిత్సలో వినియోగిస్తారు. ఈ పిటిషన్లో పస లేదని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది.






