భారీ డీల్ కు డిఫెక్స్ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్
సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరిన్ని యుద్ధ విమానాలను సమకూర్చుకోనుంది. ఇందుకు సంబంధించిన భారీ డీల్‌కు డిఫెన్స్ ప్యానెల్ ఓకే చెప్పింది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం 97 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ కాఫ్ట్ర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అలాగే మరిన్ని యుద్ధ విమానాలు పొందేందుకు లైన్ క్లియన్ చేసింది. 156 ప్రచండ్ యుద్ద హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా అనుమతించింది. వీటిలో 90 హెలికాప్టర్లు ఆర్మీకి 66 హెలికాప్టర్లు ఐఏఎఫ్‌కు కేటాయించనున్నారు.






