అధునాతన సీలింగ్ లైట్ ఎల్ఈడీ ప్యానెల్ ను ఆవిష్కరించిన క్రాంప్టన్
లైటింగ్ విభాగంలో భారతదేశ అగ్రగామి కంపెనీ అయిన క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏళ్లుగా ఎల్ఈడీ విభాగంలో వినూత్న లైటింగ్ ఉత్పత్తులతో ముందుకు సాగు తోంది. కంపెనీ ఇప్పుడు తన తాజా సీలింగ్ లైట్స్ – స్టార్ లార్డ్ శ్రేణితో ఈ వినూత్నతన మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తోంది. ఇవి అధిక ప్రకాశాన్ని అందిస్తాయి మరియు చూసేందుకు స్టయిలిష్ అల్ట్రా స్లిమ్ రిమ్స్ తో ఉంటా యి. స్లీకర్ సీలింగ్, బ్రైటర్ ఇలుమినేషన్ మరియు ఎన్నో ప్రయోజనాల కోసం తన నైపుణ్యవంతమైన డిజైన్ మా ర్గదర్శకత్వాన్ని సంస్థ అందిస్తోంది. కంపెనీ తన వినియోగదారులకు గరిష్ఠ స్టైల్ తో గరిష్ఠ ప్రకాశాన్ని అందిం చేందుకు తాజా ఉత్పత్తులు వీలు కల్పిస్తాయి.
మన జీవితంలో లైటింగ్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మనం నివసించే చోట స్పేస్ ను అది అధికం చేస్తుంది. మూడ్ ను, వాతావరణాన్ని పూర్తిగా పరివర్తింపజేస్తుంది. ఎల్ ఈడీ పై ఉన్న దృక్పథంలో మార్పు కూడా మార్పు వచ్చింది. సాధారణ ప్రకాశం అవసరం ఇప్పుడు మ రింత మెరుగుపడింది. ఇంటి అలంకరణలో భాగమైంది. ఎల్ ఈడీ ప్యానెల్స్ ఇప్పుడు ప్రకా శాన్ని ఫాల్స్ సీలింగ్స్ లో డిజైన్ టచ్ తో అందిస్తున్నాయి. అది గదికి మరింత స్టయిల్ ను జోడిస్తుంది. మరింత ప్రకాశాన్నీ అందిస్తుంది. గది కాంతివంతంగా ఉండేందుకు కొనుగోలుదారులు ఎల్లప్పు డూ గరిష్ఠ ప్రకాశం కోసం చూస్తుంటారు. సరైన బల్బులను ఎంచుకోవడంలో వారు మరింతగా నిమగ్నమవుతున్న కొద్దీ అల్ట్రా మోడర్న్ గా ఉంటూ తగినంత ప్రకాశత్వాన్ని అందించే వాటిని లేదా గది నాలుగువైపులా సమానంగా ప్రకాశాన్ని అందించగలిగే వాటినీ కనుక్కోవడం కష్టమవుతుంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కీలక అవసరాలను తీర్చేలా క్రాంప్టన్ యొక్క స్టార్ లార్డ్ 100 లుమెన్స్ పర్ వాట్ తో అల్ట్రా స్లిమ్ ఎల్ఈడీ ప్యానెల్స్ శ్రేణిని అందిస్తోంది. ఇవి శక్తిని ఆదా చేయడం మాత్రమే గాకుండా అధిక ప్రకాశాన్ని, దాంతో పాటు మరింత స్టయిల్ ను కూడా అందిస్తాయి.
ఈ సందర్భంగా క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లైటింగ్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ కౌల్ మాట్లా డుతూ, ‘‘ ఇంటి పునరుద్ధరణ మొదలుకొని ఇంటిని అలంకరించడం దాకా స్టార్ లార్డ్ మీరు ఉండే స్థలాన్ని ఏకరీతిన ప్రకాశవంతం చేస్తూ మీరు చేసే పనులను మరింత సులభంగా, నిర్మాణాత్మకంగా చేసే వీలును కల్పి స్తుంది. కాంతికి సంబంధించి గొప్ప పనితీరు, స్టయిల్ కి సం బంధించి గొప్ప డిజైన్ గా ఇది ఉంటుంది. దీని కీలక విశిష్టతలేవీ కూడా ప్రాథమిక కాంతి, వ్యయం, శక్తి ఆదా అవసరాలపై రాజీపడలేదు. సౌఖ్యాన్ని, సౌలభ్యాన్ని, స్టయిల్ ను జోడించడాన్ని క్రాంప్టన్ విశ్వసిస్తుంది. వీటన్నిటికీ వినూత్నత వెన్నుదన్నుగా ఉంటోంది. మా నూతన ఉత్పాదన స్టార్ లార్డ్ ఈ విశిష్టతలను అందించేలా మరియు మీ ఇంటిని సంతోషదాయక ప్రాంతం గా చేసేలా డిజైన్ చేయబడింది’’ అని అన్నారు.
క్రాంప్టన్ యొక్క స్టార్ లార్డ్ అనేది 100 లుమెన్ పర్ వాటేజ్ లుమెన్ సామర్థ్యాన్ని కలిగిఉంది. ఇతర ప్యానెల్స్ తో పోలిస్తే మరింత ప్రకాశత్వాన్ని అందిస్తుంది. కాంతి పడే స్థలాన్ని అధికం చేస్తుంది. దీని అల్ట్రా స్లిమ్ రిమ్ తో స్లీ కర్ డిజైన్ సాధ్యపడింది. అది మరింత స్టయిల్ నిచ్చేలా ఫాల్స్ సీలింగ్ తో మిళితం అవుతుంది. ఈ శ్రేణి రౌండ్ మరియు స్క్వేర్ ప్రామాణిక ఆకారాల్లో లభ్యమవుతుంది. గదిని గరిష్ఠ ప్రకాశంతో మరియు గరిష్ఠ స్టయిల్ తో ఉం చగల విభిన్న కలర్ టెంపరేచర్ వేరియంట్స్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. బ్రైట్ వైట్ గ్లో కలిగిఉండే కూల్ డే లైట్ కలర్ (6500కె) నుంచి నేచురల్ లైట్ తో ఉండే (4000కె) దాకా ఇవి సహజంగా మారుతూ ఉండే సూర్య కాంతి యొక్క అందమైన ప్రకాశత్వాన్ని అందిస్తాయి. వార్మ్ వైట్ (3000కె) అనేది వార్మ్, కోజీ వాతావరణాలకు అనువైంది. ఇళ్లు, కార్యాలయాలు, ఆడిటోరియంలు, కమర్షియల్ ఇంటీరియర్ ప్లేసెస్ లో వీటిని వాడవచ్చు.
గరిష్ట ప్రకాశం కోసం మరియు గరిష్ఠ స్టయిల్ కోసం చూసే వినియోగదారులకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాంటింది. దిగువ సుసంపన్న ఫీచర్లతో, ప్రయోజనాలతో నూతన స్టార్ లార్డ్ తనదైన శ్రేణిని ప్రవేశపెడుతోంది.
- గరిష్ట ప్రకాశం కోసం వాటేజ్ కాంతికి100 ల్యూమన్ ల మేరకు ల్యూమన్ సమర్థత
- అల్ట్రా స్లిమ్ రిమ్. ఇది గరిష్ట స్టయిల్ కోసం ఫాల్స్ సీలింగ్‌తో మిళితం అవుతుంది, స్లీకర్ డిజైన్‌గా మారు తుంది.
- పరిమాణాలు ప్రామాణికంగా ఉన్నాయని నిర్ధారిస్తూ రైట్ కటౌట్ సైజుతో వస్తుంది. ఇది ఎలక్ట్రీషియన్లకు వ్యవస్థాపనను ఇబ్బంది లేని ప్రక్రియ గా చేస్తుంది.
- అధిక శక్తి కారకం> 0.9తో స్టార్ లార్డ్ విద్యుత్ నష్టాలను తగ్గిస్తుంది మరియు ప్యానెల్స్ జీవితాన్ని పెంచుతుంది
- వైడర్ బీమ్ యాంగిల్‌తో కలసి అంతటా కాంతి ఒకే విధంగా వ్యాపించిందని మిల్కీ వైట్ డిఫ్యూజర్ నిర్ధారిస్తుంది. లైట్ అవుట్ పుట్ ఆ ప్రదేశం యొక్క అన్ని మూలలకు ఏకరీతిగా కాంతి చేరుకునేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ ఉత్పాదనల ధరల శ్రేణి:
|
ఉత్పత్తి రకం |
గరిష్ఠ చిల్లర ధర |
|
5W – CDL/NW/WW |
400 |
|
10W – CDL/NW/WW |
600 |
|
12W – CDL/NW/WW |
700 |
|
15W – CDL/NW/WW |
800 |
|
20W – CDL/NW/WW |
1200 |






