Cognizant : ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కీలక నిర్ణయం

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణ వయసు 58గా ఉండగా, దాన్ని 60కు పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ అంతర్గత మెమోలో ఉద్యోగుల (Employees )కు తెలియజేసింది. ఈ మార్పు భారత్(India) లోని అన్ని కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని తెలుస్తోంది. చాలా ఐటీ సంస్థ (IT company )ల తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లుగా నిర్ణయించాయి. తాజాగా కాగ్నిజెంట్ ఈ వయసును 60కి పెంచింది. అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.