ఎస్‌బీఐ చైర్మన్‌గా తెలుగు తేజం

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్‌బీఐ) చైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఈయనే. ప్రస్తుత చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఈ నెల 28న పదవీ విరమణ చేయనుండగా అదేరోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. శ్రీనివాసులు శెట్టి నియామకాన్ని ఆర్థికసేవ విభాగం ప్రతిపాదించగా, అందుకు మంత్రివర్గ నియామకాల సంఘం ( ఏసీసీ) ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలోని పెద్ద పోతులపాడు గ్రామం ( ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా) లో శ్రీనివాసులు జన్మించారు.