అమెజాన్‌కు షాక్… రూ.200 కోట్ల ఫైన్
అమెజాన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. వ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటా కొనుగోలుకు అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందానికి 2019 నవంబరులో ఇచ్చిన అనుమతిని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిలుపుదల చేసింది. కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెజాన్‌కు రూ.202 కోట్ల అపరాధ రుసుమునూ విధించింది. రిలయన్స్-వ్యూచర్ గ్రూప్‌ల మధ్య జరిగిన ఈ 24,713 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్, వ్యూచర్ గ్రూప్‌ల మధ్య జరుగుతున్న న్యాయపోరాటం నేపథ్యంంaలో ఈ ఆదేశాలు రావడం గమనార్హం. నిర్దిష్ఠ పరిమితికి మించిన వాటాల విక్రయాలకు సీసీఐ అనుమతి తప్పనిసరి. సాధారణంగా ఒకసారి ఇచ్చిన అనుమతులను నిలిపేవయం చాలా అరుదుగా జరుగుతుంది.






