అమెరికా టెక్నాలజీ రంగంలో భారీ డీల్!
అమెరికా టెక్నాలజీ రంగంలో ఒక భారీ డీల్ జరిగింది. కంప్యూటర్ చిప్స్ తయారీ సంస్థ బ్రాడ్‌కామ్ 5.7 లక్షల కోట్లతో (69 బిలియన్ డాలర్లు) క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ వీఎంవేర్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు ప్రపంచ వ్యాప్తంగా పలు రెగ్యులలేటరీలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. తాజాగా చైనా రెగ్యులేటరీ నుంచి కూడా ఆమోదం లభించింది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ డీల్‌కు ఆమోదం విషయాన్ని ప్రస్తావించారు. ఇది జరిగిన వెంటనే చైనా ఈ డీల్‌ను ఆమోదించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా సాన్‌జోస్ ప్రధాన కేంద్రంగా బ్రాడ్‌కామ్ కార్యకలాపాలు సాగిస్తోంది. సెమీకండక్టర్ల డిజైన్, డెవలప్మెంట్, పంపిణితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ సేవలు కూడా అందిస్తుంది. ఒక వీఎంవేర్ పాలో ఆల్టో కేంద్రంగా పని చేస్తోంది. ఇవి ఒక కంప్యూటర్లో వర్చువల్ మరో కంప్యూటర్ను నడిపించగలవు. ఇవి కంప్యూటర్ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.






