Bitcoin :మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్ కాయిన్

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) విలువ లక్ష అమెరికా డాలర్లకు (రూ.86 లక్షలకు పైగా) చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ఈనెల 20న బాధ్యతలు చేపట్టాక, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్రిప్టోకరెన్సీలకు అనుకూలం గా చర్యలు తీసుకుంటారనే భావనే బిట్‌కాయిన్ విలువ దూసుకెళ్లడానికి కారణం. ప్రపంచానికే క్రిప్టో రాజధానిగా అమెరికా (America)ను చేస్తారనీ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2009లో ఆవిష్కరించిన బిట్ కాయిన్ ఏ బ్యాంకు (Bank)ల నియంత్రణలోనూ ఉండడదు. రెండేళ్ల క్రితం 20,000 డాలర్ల సమీపంలో ఉన్న బిట్‌కాయిన్ విలువ ఈ వారం మొదట్లో 90,000 డాలర్ల వద్ద ఉంది. తాజాగా లో డాలర్లపైకి చేరింది.