2022లో అగ్రస్థానంలో బిల్‌గేట్స్
సేవా కార్యక్రమాలకు 2022 లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తులు లేదా సంస్థల జాబితాలో బిల్‌గేట్స్ మొదటి స్థానం నిలిచారు. ద క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ 10 మంది ఇచ్చిన విరాళాల మొత్తం 9.3 బిలియన్ డాలర్లు. ఇందులో బిల్‌గేట్స్ ఒక్కరే 5 బిలియన్ డాలర్లను బిల్ అండ్ మిలిండా గేట్స్‌కు విరాళామిచ్చారు. ఆయన ప్రధానంగా ప్రపంచ ఆరోగ్యం, యూఎస్ విద్యాబివృద్ధి మొదలైన వాటిని దన్నుగా నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తల్లి, అతడి సవతి తండ్రి అయిన జాకీ జెజోస్, మైక్ బెజోస్‌లు 710.5 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈ మొత్తాన్ని వారు క్యాన్సర్ ఔషధాల పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ కోసం కేటాయించారు. 473.3 మిలియన్ డాలర్లు దానం చేసి వారెన్ బఫెట్ తర్వాతి స్థానంలో ఉన్నారు.






