భారత్తో ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందం.. త్వరలోనే అమలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందు కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇరుదేశాలు అంగీకరించిన తేదీ నుంచి స్వేచ్ఛా వాణిజ్యం అమల్లోకి వస్తుంది. భారత్తో మా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ తెలిపారు. ఇండియా-ఆస్ట్రేలియా ఏకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ( ఏఐ-ఈసీటీఏ) అములు కావడానికి ముందు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. భారత్లో ఇలాంటి ఒప్పందాలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదిస్తుంది. రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్లో ఒప్పందం జరిగింది.






