అరబిందో ఔషధానికి అమెరికాలో.. అనుమతి
బుడెసొనైడ్ ఇన్హలేషన్ సస్పెన్షన్ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేయడానికి అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి లభించింది. ఈ మందను చిన్న పిల్లల్లో ఆస్తమా వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. ఇది ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన పల్మికార్ట్ రెప్సూల్స్ ఇన్హలేషన్ సస్పెన్షన్‌కు జనరిక్ ఔషధం. ఇక్వియా అనే సంస్థ లెక్క ప్రకారం అమెరికాలో గత ఏడాది కాలంలో ఈ మందు 226 మిలియన్ డాలర్ల ( (సుమారు రూ.1875 కోట్ల) అమ్మకాలు నమోదు చేసింది.






