అమెరికా మార్కెట్ కు అరబిందో ఫార్మా ఔషధం
ఆంఫొటెరిసిన్ బి లిపోసమ్ ఇంజక్షన్ 50 ఎంజీ ఔషధానికి అరవిబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ మందు కోసం టీటీవై బయోఫార్మ్ కంపెనీ లివిటెడ్ అనే సంస్థతో యూగియా ఫార్మా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం టీటీవై బయోఫార్మ్ కంపెనీకి చెందిన తైవాన్ యూనిట్లో మందు ఉత్పత్తి చేస్తారు. అమెరికా మార్కెటింగ్ బాధ్యతలను యూగియా ఫార్మా నిర్వహిస్తుంది. ఆంఫొటెరిసిన్ బి లిపోసమ్ ఇంజక్షన్, అస్టెల్లాస్ ఫార్మా యూఎస్ ఇంక్, అనే సంస్థకు చెందిన యామ్బైసోమ్ లిపోసమ్ ఇంజక్షన్‌కు ఇది జనరిక్ ఔషధం. యూఎస్ఎఫ్డీఏ అనుమతి వచ్చినందున ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ మందును యూఎస్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడిరచింది.






