Apple: అమెరికాలో ఆపిల్ 8.32 లక్షల కోట్ల పెట్టుబడులు
అమెరికాలో తయారీ విభాగాన్ని బలోపేతం చేయడానికి యాపిల్ (Apple) సంస్థ రూ.8.32 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వైట్‌హౌస్ అధికారి టేలర్ రోజర్స్ (Taylor Rogers) వెల్లడించారు. తయారీ రంగంలో ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావాలనే ప్రయత్నాలకు ఈ నిర్ణయం ఊతమిస్తుందని ఆ అధికారి అన్నారు. రానున్న నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫిబ్రవరిలో యాపిల్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెక్స్ సలో ఏఐ (AI) సర్వర్ల తయారీ ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇక్కడ పరిశోధన, అభివృది రంగంలో 20 వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. అయితే, ఈ పెట్టుబడుల గురించి అటు యాపిల్ సంస్థ గానీ, ఇటు ట్రంప్ (Trump) గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.







