రికార్డు సృష్టించిన ఆపిల్…
దేశంలో తన తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్ ఆసియా పసిఫిక్ దేశాలతోపాటు ఇండియాలో ఈ త్రైమాసికంలో రికార్డు అమ్మకాలను సాధించామని ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభించిందని ప్రకటించారు. ఇందుకు యూజర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






