ఒప్పంద ఉద్యోగులకు యాపిల్ షాక్
టెక్ దిగ్గజం యాపిల్ వందలాది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వీరి ఉద్యోగాలకు ఢోకా లేదని గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా ఇచ్చిన కంపెనీ తాజాగా వారిపై వేటు వేయడం షాక్‌కు గురి చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు హైర్ చేసిన ఉద్యోగులైన వీరంతా ఆయా ప్రాజెక్టులపై యాపిల్ ఉద్యోగులతో పనిచేస్తున్నారు. అలాంటి కాంట్రాక్టు ఉద్యోగులపై యాపిల్ కొరడా రaుళిపించింది. ఖర్చులు తగ్గించునేందుకే కాంట్రాక్టు ఉద్యోగులనూ యాపిల్ తొలగించిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. యాపిల్‌తో ఈ వర్కర్లు 15 నెలల కాంట్రాక్టులు కలిగి ఉన్న వారి ఒప్పందం ముగిసేవరకూ వేచి చూడాలని కంపెనీ వారిని ఉన్నపళాన ఉద్యోగాల నుంచి తొలగించింది.






