Apple : భారత్ నుంచే అమెరికాకు… ట్రంప్ వ్యాఖ్యలు పట్టించుకోని టిమ్ కుక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నకు చిర్రెత్తించే విషయాన్ని వెల్లడిరచారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) . భారత్‌లో ఫోన్ల తయారీ చేపట్టడంపై ట్రంప్ తన అసహనం వ్యక్తం చేయగా, ఆయన వ్యాఖ్యలను పెడచెవిన పెట్టారు. అమెరికాలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమ్ముడైన ఐఫోన్ల (iPhones) లో మెజారిటీ ఫోన్లు భారత్‌లో తయారైనవేనని చెప్పారు. మున్ముందూ యాపిల్ తయారీ భారత్ (India) లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. యాపిల్ త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఈ సందర్భంగా టిమ్ కుక్ మాట్లాడుతూ గత త్రైమాసికంలో కొనసాగిన వైఖరే మున్ముందూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో విక్రయమయ్యే ఫోన్లు దాదాపుగా భారత్‌లో తయారైనవే. అమెరికాలో వినియోగించే ఇతర యాపిల్ ఉత్పత్తులైన మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, యాపిల్ వాచ్‌లను వియత్నాంలో తయారు చేస్తున్నాం. ఇతర దేశాలకు చైనా నుంచి ఎగుమతి చేస్తున్నాం అని టిమ్ కుక్ వివరించారు.







