అమజాన్ కీలక నిర్ణయం.. మూడో వ్యాపారానికి మంగళం!
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీ ఎత్తున ఉద్యోగాల కోతలతో పాటు ఎడ్యుటెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వ్యాపారానికీ మంగళం పాడింది. భారత్లో హోల్సేల్ డిస్రిబ్యూషన్ వ్యాపారాన్ని మూసివేస్తునట్లు తాజాగా ప్రకటించింది. భారత్లో వ్యాపార కార్యకలాపాల నిలిపివేతపై అమెజాన్ నుంచి ప్రకటన రావడం వారం వ్యవధిలో ఇది మూడోది కావడం గమనార్హం. ఎడ్యుకెట్ మూసివేతప నవంబరు 24న ఫుడ్ డెలివరీపై నవంబరు 25న అమెజాన్ ఇండియా ప్రకటనలు చేసింది. అమెజాన్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానంగా బెంగళూరు, మైసూరు, హుబ్లీ నగరాల్లో నిర్వహిస్తోంది. చిన్న వ్యాపారులు ఈ వెబ్సైట్ ద్వారా హోల్సేల్ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వీలుండేంది. అయితే ఈ వ్యాపారాన్ని మూసివేసినట్లు అమెజాన్ ఇండియా తాజాగా ప్రకటించింది. వార్షిక కార్యకలాపాల సమీక్ష ప్రక్రియలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






