గ్లోబల్ సెల్లింగ్‌లో మనవాళ్ల హవా
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌లో ఈఏడాది నవంబర్ 24 నుంచి 28 వరకు నిర్వహించిన బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండ్ అమ్మకాల్లో మన వ్యాపారులు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఇండియన్ ఉత్పత్తులు విక్రయించారు. గతం కంటే ఈ సారి 100 శాతం అమ్మకాలు పెరిగాయని అమెజాన్ తెలిపింది. అమెజాన్ గ్లోబల్ మార్కెట్లు అయిన అమెరికా, ఐరోపా, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది భారతీయ వ్యాపారులకు చెందిన మెడిన్ ఇండియా వస్తువులను ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇండియన్ వస్తువులను కొనుగోలు చేశారు. అమ్మకాల్లో ప్రధానంగా బొమ్మలు 60 శాతం, వంటింటి ఉత్పత్తులు 40 శాతం, హోం ఉత్పత్తులు, 25 శాతం, ఆభరణాలు, నిత్యావరసాలు 20 శాతం అమ్మకాలు జరిగాయి. మేడిన్ ఇండియా ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా కొనుగోలు చేసేలా చేయడంలో పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్ భూపేన్ వకంర్ తెలిపారు.






