అమెజాన్ అధినేతకు భారీ షాక్.. ఒక్క రోజే
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ 18 వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్ వ్యాల్యూ ఒక్కశాతం కోల్పోయింది. దీంతో బెజోస్క్ ఒక్క రోజే 670 మిలియన్ డాలర్లు నష్టపోయారు. రెండ్రోజుల క్రితం ఆండీ జెస్సీ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అమెజాన్ ర్యాపిడ్‌గా ఉద్యోగుల్ని నియమించుకుంది. కానీ గత కొద్ది కాలంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. కాబట్టే ఖర్చుల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులను పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటనతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. స్టార్ మార్కెట్లో అమెజాన్ షేర్లను అమ్ముకోవడంతో ఒక్కరోజే 600 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.






