ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్‌బొల్లా, ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రికత్తలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామల వేళ భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నోటీసులిచ్చేంతవరకు టెల్‌అవీవ్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.