ఎయిరిండియా కీలక నిర్ణయం!

డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుందన్న అంచనాలు పశ్చిమాసియాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం. దాంతో ఐరోపాకు వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇతర దేశాల సంస్థలు కూడా ఇదే బాటపట్టాయని తెలిసింది. గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్`హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది.