ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సిస్కో
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సిస్కో 4 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సిస్కో గత నెలలోనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. సిస్కో తొలగించాల్సిన ఉద్యోగులకు వ్యక్తిగత మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించిన సిస్కో అందుకు అనుగుణంగా 4 వేల మందిని లేఆఫ్ చేసింది. సంస్థలో కొన్ని బిజినెస్లను పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను తగ్గించుకున్నట్లు సంస్థ చైర్మన్, సీఈవో రాబిన్స్ తెలిపారు. ప్రముఖ టెక్నాలజీ, ఐటీ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 2 లక్షలకు పైగా ఉందని దిలేఆఫ్ డాట్కామ్ అనే వెబ్సైట్ అంచనా వేసింది. ప్రధానంగా అమెరికాల ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉందని పేర్కొంది.






