అడిదాస్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్ కు పోటీగా
జపాన్ స్పోర్ట్స్ షూ మేకింగ్ దిగ్గజం అడిదాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా సొంతంగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో పడింది. దీంతో పాటు అమెరికాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్ సంస్థ కాయిన్ బేస్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందంపై అడిదాస్ ట్వీట్ చేయగా కాయిన్ బేస్ స్పందించింది. హ్యాండ్ షేక్ ఎమోజీని రీట్వీట్ చేస్తూ డీల్‌ను కాన్ఫాం చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిపి క్రిప్టో కరెన్సీపై ట్రేడిరగ్ నిర్వహించనున్నాయి. ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ మెటావర్స్ టెక్నాలజీపై వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టెక్నాలజీని పలు దిగ్గజ కంపెనీలు సైతం డెవలప్ చేసే పనిలో పడ్డాయి. తాజాగా కు చెందిన ఆడిదాస్ అడివెర్స్ పేరుతో మొబైల్ గేమింగ్ సంస్థ శాండ్ బాక్స్ తో కలిసి మెటావర్స్‌పై పనిచేస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇక అడిదాస్ రాకతో మోటావర్స్పై వర్క్ చేస్తున్న ఫేస్‌బుక్‌కు పోటీ పెరగనుంది.






