Adani: అలా చేస్తే భార్య పారిపోతుంది.. అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ (India)చేరాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy ) గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దు. కొందరు నాలుగు గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరికొరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బాలెన్స్. పనిలో నిమగ్నమైపోతే భార్య పారిపోతుంది. మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం. పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి, ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది అని అదానీ అన్నారు.