బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ… ఉద్యోగులకు నాలుగేళ్ల జీతం
తైవాన్‌కు చెందిన ఎవర్ గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్‌లు ప్రకటించింది. ఈ కంపెనీ ఏకంగా నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్ గా ఇస్తోంది. ఈ విసయాన్ని ఆ సంస్థలో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడిరచాయి. తైవాన్‌కు చెందిన ఈ షిప్పింగ్ సంస్థ 50 నెలల జీతంతో సమానమైన బోనస్ ఇస్తోంది. ఇది నాలుగు సంత్సరాల జీతం కంటే ఎక్కువ. ఉద్యోగి జాబ్ గ్రేడ్, తైవాన్ అధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో సంస్థ ఉద్యోగి పనితీరు మీద ఆధారపడి సంవత్సరాంతపు బోనస్‌లు ఉంటాయని ఎవర్ గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు మాత్రం వెల్లడిరచలేదు.






