పదేళ్ల బాలిక.. నెలకు కోటిపైనే ఆదాయం
ఆస్ట్రేలియాకు చెందిన పిక్సిస్ కర్టిస్ అనే 10 యేళ్ల బాలిక తల్లి సహాయంతో బొమ్మల వ్యాపారం (టాయ్ బిజినెస్) చేస్తోంది. తద్వారా నెలకు రూ.1 కోటి 4 లక్షలకు పైనే సంపాదిస్తోంది. కలర్పుల్ బొమ్మలతో పాటు, ఆకర్షనీయమైన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ వంటి (హెయర్ యాక్ససరీస్) వాటిని నిమిషాల్లో అమ్మి పెద్ద మొత్తంలో ఆర్జిస్తుంది. బాలిక తల్లి మాట్లాడుతూ చాలా చిన్న వయసులోనే నా కూతురు బిజినెస్లో విజయం సాధించి నా కలను నెరవేర్చింది. నా చిన్నతనంలో 14 యేళ్ల వయసులో మెక్డోనాల్డ్స్లో పనిచేశాను. కానీ నా కూతురు అంతకంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిక్సిస్ సిడ్నీలో ప్రైమరీ స్కూల్లో చదువుతూ బిజినెస్ చేస్తోంది. తాను కోరుకుంటే 15 యేళ్లకే రిటైర్ అయ్యేలా కూడా ప్లాన్ చేశాం. అంతేకాదు కోటి 41 లక్షల రూపాయల విలువైన మెర్సిడెస్ కారు కూడా నా కూతురికి ఉందని పేర్కొంది.






