ASBL NSL Infratech

కార్తీ, రాశీ ఖన్నా నటించిన సర్దార్​, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

కార్తీ, రాశీ ఖన్నా నటించిన సర్దార్​, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో తిరుగులేని ఛానల్​ జీ తెలుగు. సరికొత్త మలుపులు, అలరించే కాన్సెప్టులతో ఫిక్షన్, నాన్​ ఫిక్షన్​ షోలతోపాటు వారం వారం బ్లాక్​బస్టర్​ సినిమాలు అందిస్తూ ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు మరో సూపర్​ హిట్​ ​ సినిమా సర్దార్​తో మీ ముందుకు రాబోతోంది. హీరో కార్తీ డబుల్​ రోల్​లో మెప్పించిన యాక్షన్​ ఎంటర్​టైనర్​ సర్దార్​ ఫిబ్రవరి 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది.

కార్తీ ద్విపాత్రాభినయంతో తమిళ మాతృకగా రూపొందిన సర్దార్​ తెలుగులోనూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన సర్దార్​ నీటి ప్రాధాన్యం తెలిపే అంశంతో ముడిపడిన కథ. నీటి నిర్వహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు దర్శకుడు పీఎస్​ మిత్రన్​. పైప్​లైన్​ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని.. దేశద్రోహిగా అజ్ఞాతంలో జీవిస్తున్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్​ కథ. యువకుడిగా, మధ్య వయస్కుడిగా డ్యుయల్​ రోల్​లో కార్తి నటనతోపాటు, రాశీ ఖన్నా, రజీశా విజయన్, చంకీ పాండే, లైలా నటించిన కీలక పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అద్భుతమైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు కట్టిపడేసే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని డం కలిగించడం ఖాయం.

ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యాక్షన్​ ఎంటర్టైనర్ సర్దార్​ జీ తెలుగు ప్రీమియర్గా ప్రసారం కానుంది. తప్పక వీక్షించండి, మీ అభిమాన ఛానల్​ జీ తెలుగులో

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :