Donald Trump:నాకు నోబెల్ ఇవ్వకపోతే .. దేశానికే అవమానం

నోబెల్ శాంతి బహుమతి (Nobel Prize) కోసం కలవరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నోబెల్ ఇవ్వకపోతే, అది అమెరికా (America) కే అవమానం అని అన్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాల్లో తలెత్తిన ఏడు యుద్ధాలను తాను ఆపిన తర్వాత కూడా, నోబెల్ ఇవ్వకపోతే, అగ్రరాజ్యాన్ని అవమానించినట్టేనని చెప్పారు. తాజాగా గాజా (Gaza) యుద్ధానికి కూడా ముగింపు పలికేలా తాను తీసుకుంటున్న చర్యలను ఆయన ఉటంకించారు. క్వాంటికోలో సైనిక అధికారులతో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒక పుస్తకం రాసిన వ్యక్తికి ఇస్తారని, కానీ, ఈసారి అలా జరగదని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ తనను కాదని ఏ రచయితకైనా ఇస్తే అది అమెరికాకు తీరని అవమానమేనని తేల్చి చెప్పారు.