Washington: డోజ్ పదవికి మస్క్ గుడ్ బై… ఎలాన్ నిర్ణయం వెనక…?

టెస్లా సీఈవో, అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని ఈ సందర్భంగా మస్క్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్‌ను డోజ్ శాఖ సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. దీనిలో భాగంగా ఎలాన్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఉద్యోగుల తగ్గింపు.. పలుశాఖలకు నిధుల కోత లాంటి నిర్ణయాలు వెలువడ్డాయి. డోజ్ నిర్ణయాలను ట్రంప్ కార్యవర్గం అమలు చేసింది కూడా..
అయితే మస్క్ నిర్ణయాల ఫలితంగా తమ ఉద్యోగాలు పోయాయని.. తమ అవకాశాలు తెబ్బతిన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. దీని ప్రబావం టెస్లా కంపెనీపై పడింది. చాలా చోట్ల కంపెనీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. టెస్లా వాహనాల బాయ్ కాట్ కూడా ఉద్యమంలా నడిచింది.దీంతో .. తనకు వ్యాపారపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన మస్క్.. డోజ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. తన నిర్ణయాన్ని అమలు చేశారు.