అయోధ్య లో శ్రీ రామ మందిర్ వేడుక రోజున అమెరికా లో శ్రీ రామ నామ స్మరణ

అయోధ్య లో శ్రీరాములవారి ఆలయ నిర్మాణ భూమిపూజ ఆగస్టు 5th బుధవారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అనేక ప్రముఖుల సమక్షంలో వేదమంత్రాల నడుమ రంగ వైభోగం గా జరగగా అమెరికా మరియు బ్రిటన్ వ్యాప్తం గా కూడా బుధవారం 5 ఆగస్ట్ న అయోధ్య రామ మందిర భూమిపూజ సంబరాలు ఎటువంటి అపశృతులు జరగకుండా , కోవిద్-19 నిబంధలను అతిక్రిమించకుండా వైభోగంగా జరిగాయి.
స్వయంగా భూమి పూజ కార్యక్రమం లో పాలుపంచుకోలేని భక్తులు భారత దేశ వ్యాప్తంగా వారి సొంత ప్రదేశాలలో సంబరాలను జరుపుకోగా అమెరికా లోని శ్రీ రాములవారి భక్తులు కూడా అనేక చోట్ల అనేక రకాలుగా శ్రీ రాములివారి పై వారి భక్తిని చాటుకున్నారు.అమెరికా లోని కాపిటల్ హిల్ లో టేబుల్ ట్రక్ చుట్టూ శ్రీ రాములవారి ఆలయ భూమి పూజ డిజిటల్ చిత్రాలను మరియు రాముల వారి చిత్రాలు ప్రదర్శిస్తూ“జై శ్రీ రామ్” అని స్మరిస్తూ కాపిటల్ హిల్ మొత్తం తిరిగారు . కాలిఫోర్నియాకు చెందిన భారతీయ సంఘం నాయకులు అజయ్ జైన్ బుటోరియా రాములవారి భక్తులకి శుభాకాంక్షలు తెలపగా అమెరికా లోని రాములవారి భక్తులు దాదాపు గా అందరూ వారి ఇళ్లల్లో దీపాలు వెలిగించి శ్రీ రామ నామ స్మరణ చేశారు.
కెనడా లోని బ్రంప్తోం మేయర్ పాట్రిక్ బ్రౌన్ రాములవారి భక్తులకి శుభాకాంక్షలు తెలపగా దేశవ్యాప్తం గా ఉన్న అన్ని హిందూ ఆలయాలలో విశిష్ట పూజలు నిర్వహించారు. అయితే న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఈ సందర్భంగా హిందీ మరియు ఆంగ్లంలో ‘జై శ్రీ రామ్’పదాలు ,రాములవారి చిత్రాలు మరియు వీడియోలు, 3 డి చిత్రాలు మరియు వీడియో లో ఆలయ రూపకల్పన తో పాటు భారత ప్రధాని మోడీ పునాది రాయి వేసిన చిత్రాలు ప్రదర్శించ బడుతున్నాయి అని సోషల్ మీడియాలో వచ్చిన చిహ్ట్రాలు మరియు వార్తలు చూసి చాలా మంది భారతీయులు న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ కి చేరుకోగా వారికి నిరాశే మిగిలింది.