సమ్మెకు దిగుతాం.. న్యూయార్క్ ఉపాధ్యాయుల హెచ్చరిక

అమెరికాలో పాఠశాలల పున్ణ ప్రారంభంపై ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమౌతున్నారు. దేశంలో ఒకవైపు కరోనా విలయతాండం చేస్తుండగానే ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పాఠశాలను పున్ణ ప్రారంభానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగుతామని న్యూయార్క్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ (యుటిఎఫ్) హెచ్చరించింది. పాఠశాలల ప్రారంభానికి ముందు కచ్చితమైన జాగ్రత్తల ప్రాణాళికను అమలు చేయకపోతే జిల్లా అధికారులపై కోర్టులో కేసు వేస్తామని అన్నారు.
యుటిఎఫ్ అధ్యక్షుడు మిచెల్ ముల్‍గ్య్రూ మాట్లాడుతూ న్యూయార్క్ మేయర్ ప్రజలను ప్రమాదకర పరిస్థితుల్లోకి బలవంతంగా నెడుతున్నారని, దీనిపై తాము కోర్టుకు వెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని కోరతామని చెప్పారు. సెప్టెంబర్ 10 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమౌతాయని నగర మేయర్ బిల్ డిబ్లాసినో ఇప్పటికే వెల్లడించారు. tయుటిఎఫ్‍లో దాదాపు లక్షా 33 వేల మంది ఉపాధాయులు సభ్యులుగా ఉన్నారు. వీరు సమ్మెకు దిగితే పాఠశాలల పున ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పాఠశాలల ప్రారంభానికి అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఒత్తిడి ఉన్నా కరోనా నేపథ్యంలో పాఠశాలల ప్రారంభాన్ని పలు రాష్ట్రాలు, విద్యాసంస్థలు వాయిదా వేశాయి. ఆన్‍లైన్ క్లాసులకు చికాగో రాష్ట్రం ప్రణాళికలు రచిస్తోంది.