న్యూయార్క్‌లో రాముడి చిత్రాల ప్రదర్శన

రాముడి చిత్రపటాలను, ఆలయ త్రీడీ నమూనాను న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆగస్టు 5న ప్రదర్శించనున్నారు. చరిత్రాత్మక వేడుక జరిగే రోజు ఇక్కడ 17,000 చదరపు అడుగుల భారీ ఎల్‍ఈడీ తెరపై వీటిని ప్రదర్శిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు జై శ్రీరాం అనే పదాలు హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ తెరపై కనిపిస్తాయి. కొన్ని వీడియోలను ప్రదర్శిస్తారు.