ఒక్కరోజులో రూ.97 వేల కోట్లు ఆర్జించిన జెఫ్ బెజోస్

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కేవలం ఒక్కరోజులో రూ.97 వేల కోట్ల (13 బిలియన్ డాలర్లు) లాభాలను ఆర్జించారు. ఒక్కరోజులో ఇంత మొత్తంలో సంపాదించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ షేర్లు 7.9 శాతం మేర లాభాల్లో దూసుకెళ్లాయి. దీంతో ఇప్పటికే ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్‌గా కొనసాగుతున్న 56 ఏళ్ల బెజోస్ సంపద తాజాగా 189.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద 74 బిలియన్ డాలర్లమేర పెరగడం మరో విశేషం.