‘వన్ ఇన్ మిలియన్ అవార్డు’ గెలుచుకున్న భారతీయ అమెరికన్ కవలలు

న్యూయార్క్ కు చెందిన భారతీయ అమెరికన్ కవలలు, రెనీ మెన్డోంకా మరియు రియా మెన్డోంకా, రాబోయే అధ్యక్ష ఎన్నికలలో ఓటింగ్ గురించి యువతకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
కవలలు వైవోట్ ( Why Vote? )అనే యువజన సంస్థ ద్వారా యువత ఆన్‌లైన్‌లో ఓటు ఎందుకు నమోదు చేసుకోవాలి మరియు నమోదు చేసుకునేటప్పుడు, బ్యాలెట్ బాక్స్ వద్ద ఓటు వేసేటప్పుడు వాళ్లకున్న కోరికలు అది ఎవరు నెరవేర్చ గలరు అనే నమ్మకాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి స్పష్టత కలిగించటమే దీని లక్ష్యం.
ఈ కవలలు యువతకి చేసే నిస్వార్ధ సేవల కి ‘మల్టిప్లై ది గుడ్’ అనే సంస్థ వారికి “వన్ ఇన్ ఎ మిలియన్ అవార్డు” ప్రకటించింది. ఈ జాతీయ లాభరహిత సంస్థ ప్రజలను శక్తివంతం చేసే దిశగా పనిచేస్తుంది. న్యూయార్క్ కు చెందిన ఈ కవలలు వింగ్స్ ఆఫ్ హోప్ కోఫౌండర్లు, దీని లక్ష్యం యువతకు వాపింగ్ యొక్క ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం.
యువత ర్యాలీలో, మెన్డోంకా కవలలు న్యూయార్క్ యొక్క ప్రభావవంతమైన స్టేట్ సెనేటర్లు జెల్నోర్ మైరీ, బ్రాడ్ హోయిల్మాన్ మరియు అలెశాండ్రా బియాగ్గిలతో వర్చువల్ సంభాషణ చేశారు. కౌన్సిల్ సభ్యుడు కార్లినా రివెరా, న్యూయార్క్ నగర ప్రజా న్యాయవాది, ఈ చర్చలలో కవలలు చేసిన దృక్కోణాలతో ఆకట్టుకున్నారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.