న్యూయార్క్ సిటీ నుండి మొదటి భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు సూరజ్ పటేల్ అయ్యే సూచన

సూరజ్ పటేల్ అనే ఒక యువ భారతీయ-అమెరికన్ న్యూయార్క్ రాజకీయాలలో అలజడి సృష్టిస్తున్నారు కాబట్టి ఆ వివరాలు లోకి వెళదాం. . ఒబామా వైట్ హౌస్ మాజీ సిబ్బంది సూరజ్ పటేల్ (36), 1992 నుండి చట్టసభ సభలో ఉన్న బలమైన కరోలిన్ మలోనీ (74) పై డెమొక్రాటిక్ ప్రాధమికంలో కేవలం 648 ఓట్ల తేడాతో వెనుక ఉన్నారు. ఇంకా భారీ సంఖ్యలో మెయిల్-ఇన్ బ్యాలెట్లు లెక్కించబడలేదు మరియు 20 శాతం మంది ఓటు వైయకుండా ఉండవచ్చు అని అంచనా. వ్యక్తిగతంగా ఓట్లలో పటేల్ 40.1 శాతం, మలోనీ 41.7 శాతం పొందారు. క్వీన్స్‌లో పటేల్ కు మలోనీ కంటే 540 ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటు కవరును పై యు.ఎస్. పోస్టల్ సర్వీస్ పోస్ట్ మార్క్ లేకపోవటంవల్ల మరియు ఎన్నికల బోర్డు కొన్ని బ్యాలెట్ల జూన్ 30 తర్వాత అందుకోవడం వలన ఈ ఓట్లు మరియు బ్యాలెట్లని చెల్లనవి గా ఎన్నికల బోర్డు గుర్తించింది. అయితే గురువారం ఓటు కవరు పై పోస్ట్ మార్క్ లేకపోవటానికి ఓటర్లు కి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి, ఎన్నికల బోర్డు చెల్లవు అని పక్కన పెట్టిన బ్యాలెట్ ని కూడా లెక్కించాలి అని అభ్యర్థులు కోరారు. పటేల్ ఒక అడుగు ముందుకు వెళ్లి, జూన్ 30 లోపు అందుకున్న అన్ని బ్యాలెట్లను “బ్యాలెట్‌కు పోస్ట్‌మార్క్ లేకపోయినా” లెక్కించాలని, ఫెడరల్ కోర్టులో ఎన్నికల బోర్డుపై దావా వేశారు.
పటేల్ మీడియా తో మాట్లాడుతూ నేను ఒబామా గారి తో పనిచేసినప్పటికీ నా వెనుక పెద్ద పేరు లేకపోవటం వలన లేదా రాజకీయ నాయకుల కొడుకు ని కాకపోవటం వలన కానీ. పార్టీ “సమోసా కాకస్” అని పిలవ బడే ఐదుగురు భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు, మీడియా ఎవరు నాకు మద్దతు తెలపలేదు. న్యూయార్క్ టైమ్స్ తోసహా అందరూ మలోనీ గారికి మద్దతు తెలిపారు.చాలాకాలంగా జిల్లాలో పార్టీ పరిగణించని యువ జనాభాకు దగ్గర కావడం ద్వారా మరియు యథాతథ స్థితి విఫలమైందని పాత ఓటర్లను ఒప్పించడం ద్వారా నేను మలోనీ గారికి గట్టిపోటీ ఇవ్వగలుగుతున్నాను అని అన్నారు.
‘ అలాగే .. న్యూయార్క్ 16th కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ లో ప్రాథమికంగా 105,000 ఓట్లు నమోదు అయ్యాయి, 40000 ఓట్లు లెక్కించగా మలోనీ కి 1% ముందు అడుగు లో ఉన్నారు. లెక్కించవలసిన 65000 ఓట్లు లో 50% యువకుల ఓట్లు ఉన్నాయి, మెయిల్-ఇన్ బ్యాలెట్లను అన్ని లెక్కించినట్లయితే, నేను న్యూయార్క్ నుండి కాంగ్రెస్ కి వెళ్ళే మొదటి భారతీయ-అమెరికన్ అవుతాను ‘ అని ధీమావ్యక్తం చేశారు.
న్యూ యార్క్ యూనివర్సిటీ లో బిజినెస్ ఎథిక్స్ బోధించే పటేల్ మొదటి తరం భారతీయ-అమెరికన్. అతని తల్లిదండ్రులు 1960లో భారతదేశం నుండి వలస వచ్చారు . అతని తండ్రి ప్రారంభంలో నైట్ షిఫ్ట్ ఫిక్సింగ్ సబ్వే ట్రాక్ లో పనిచేసిన తరువాత హాస్పిటాలిటీ బిజినెస్ (ఆతిథ్య వ్యాపారం) ప్రారంభించారు.