ఇండియన్ అమెరికన్ సూరజ్ పటేల్ పై కారోలిన్ బి. మాలోనే గెలుపు

ఆరు వారాలపాటు న్యూయార్క్ సిటీ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మెయిల్-ఇన్ ఓట్ల పై ఎన్నికల బోర్డు మరియు పోస్టల్ సర్వీ ఎదుర్కొంటున్న వివాదాలకు మంగళవారం 4th ఆగస్టు వెలుబడిన ఫలితాలతో తెరపడింది. న్యూయార్క్ రిపబ్లికన్ కరోలిన్ మలోనీ సూరజ్ పటేల్ పై విజయం సాధించారు.ఈ విజయం తో ఆమె పదిహేనవ సారీ కాంగ్రెస్‌లో తన పదవిని నిలబెట్టుకునే అవకాశం ఉంది, ఆమె ప్రస్తుతం సభ పర్యవేక్షణ కమిటీకి అధ్యక్షురాలు గా విధులు నిర్వర్తిస్తున్నారు. మలోనీ 658 వ్యక్తిగత ఓట్లు, 65,000 మెయిల్-ఇన్ బ్యాలెట్లతో పటేల్‌పై ఆధిక్యంలో ఉన్న సమయానికి ఇంకా లెక్కించాల్సిన ఓట్లు ఆధిక్యం కంటే తక్కువ యువ గా ఉండటంతో మలోనీ విజయం ఖాయం అయింది చివరికి 3,700 ఓట్లు ఆధిక్యంతో మలోనీ ని విజేత గా ప్రకటించినట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.
ఫలితాలు వెలుబడిన తర్వాత మలోనీ “NY-12 యొక్క ఓటర్లు నన్ను మరో సారి కాంగ్రెస్కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, ఓటర్ల సంకల్పం స్పష్టంగా ప్రతిబింబించే నిర్ణయాత్మక గెలుపు మార్జిన్ ఇది ” అని ట్వీట్ చేయగా “మా పోరాటం ఖచ్చితంగా డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకం. మేము ఓటర్ల హక్కును తొలగించడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ఓట్లు లెక్కించబడని వేలాది మంది ఓటర్లు మాకు ఉన్నారు, మరియు మేము ఇంకా లెక్కించబడటానికి పోరాడుతున్నాము, ” అని సూరజ్ పటేల్ విలేకర్ల సమావేశం లో చెప్పినట్టు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.