NVIDIA: మైక్రోసాఫ్ట్ షాక్ ఇచ్చిన ఎన్విడియా

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా (NVIDIA) అవతరించింది. మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేర్లు రాణిస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్ (Trading) లో కంపెనీ షేర్లు 3.4 శాతం లాభపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 3.45 ట్రిలియన్ డాలర్లకు ( సుమారు రూ.296.22 లక్షల కోట్లు) చేరింది. ఇప్పటివరకు ప్రపంచం (World) లో అత్యంత విలువైన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. కృత్రిమ మేధ రంగంలో బలమైన స్థానాన్ని కొనసాగిస్తూ మార్కెట్ విలువను గణనీయంగా పెంచుకోవడంతో ఎన్విడియా ఈ ఘనత సొంతం చేసుకుంది.