Tariffs : అమెరికా 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయ్
భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు(Tariffs) బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రొయ్యలు(Shrimp), జౌళి, వజ్రాలు(Diamonds), తోళ్లు, పాదరక్షలు, రత్నాభరణాలు వంటి కార్మిక ప్రభావిత రంగాల ఎగుమతులు, ఉద్యోగాల సృష్టిపై ప్రతికూల ప్రభావం పడనుంది. భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు మరో 25 శాతం జరిమానాను విధించడంతో మన ఎగుమతుల (Exports) కు ఆటంకాలు ఏర్పడతాయని ఎగుమతిదార్లు చెబుతున్నారు. 2024-25లో భారత ఎగుమతుల విలువ 437.42 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అమెరికా వాటా 20 శాతం. 2021-22 నుంచి మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా కొనసాగుతోంది.






