తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు

బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా, వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ నరసింహస్వామి చిత్రంలో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు.