సీఎం రేవంత్ రెడ్డితో టీటీడీ చైర్మన్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రీవారి శేషవ్రస్తం కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.