Mahesh Kumar Goud : తెలుగు పారిశ్రామికవేత్తలు సొంత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి : మహేశ్‌కుమార్ గౌడ్

ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు సొంత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా(Australia) దేశంలోని మెల్‌బోర్న్(Melbourne )లో తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో(Sankranti celebrations) ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్లలు దాటి ఆస్ట్రేలియాకు వచ్చిన తెలుగు ప్రజలు మన సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా సంబరాలు నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివాసేనా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.