కేంద్రం కీలక ప్రకటన…తెలంగాణ ఆవిర్భావం తర్వాతే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్ నాటికి రూ. 4.33 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది. ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.75,577 కోట్లు అప్పులుంటే, 2021`22 నాటికి అవి రూ.2,83,452 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు రూ.1.50 లక్షల కోట్లు, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1.30 లక్షల కోట్లుగా ఉన్నాయని పంకజ్ చౌదరి వెల్లడించారు.






