Telangana Talli statue: తెలంగాణ సంస్కృతిని అర్థం పట్టే విధంగా అబ్బురపరుస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం..

పచ్చని చీర గట్టి, కంకి గుత్తి చేతబట్టి.. విజయానికి చిహ్నంగా పిడికిలి గుర్తులు ఉన్న పాదపీఠం ఎక్కి.. నిండుగా నిలుచున్న తెలంగాణ తల్లి (Telangana Talli) .. అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో ఏర్పాటు చేయనున్న ఈ తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
ఈనెల తొమ్మిదవ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి (C.M Revanth Reddy) చేతుల మీద ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విగ్రహానికి సంబంధించిన నము నాని ప్రభుత్వం విడుదల చేసింది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ విగ్రహ రూపానికి ముగ్గులైన తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించిన డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి ఎంచుకున్నారు.
అంతేకాదు ఆరోజు రాష్ట్రమంతటా పండగల జరుపుకోవడానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అధికార ,ప్రతిపక్ష తేడా లేకుండా అందరినీ ఆహ్వానించి ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR ) మరియు అతని బృందానికి కూడా ఆహ్వానాలు వెళ్తున్నాయట. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కావలసిన ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఓ భారీ ఫౌంటైన్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఫౌంటైన్ చివరన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాపిస్తారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం నమూనా చూసి.. దాంట్లోని విశిష్టత తెలుసుకున్న వారు ఆశ్చర్య పోవాల్సిందే.
మన ఇంట్లో అమ్మని చూస్తే ఎంత ధైర్యం కలుగుతుందో.. ఆ విగ్రహాన్ని చూస్తే మనసుకు అంతే ధైర్యం, శాంతి కలిగే విధంగా రూపొందించారు. నిండుగా నవ్వుతూ.. పచ్చని చీర కట్టిన ఆ తల్లి దర్శనం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. రైతన్నల కష్టం, ప్రజల పోరాట పటిమి గుర్తు చేసే విధంగా ఆ తల్లి నిండైన రూపం కనిపిస్తుంది. ఎడమ చేతిలో వరి, జొన్న, సబ్జా, మొక్కజొన్న కంకుల గుత్తి తో .. కుడి చేయి అభయ ముద్రతో.. కొంగు బిగించి చుట్టిన ఆ తల్లి కళ్ళలో పోరాట పటిమ, శ్రామిక శక్తి.. పచ్చదనానికి చిహ్నంగా కట్టిన పచ్చటి చీర అందరిని ఆకట్టుకుంటున్నాయి.