High Court :అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?

అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడతారని ఓ అత్తను ప్రశ్నించిన హైకోర్టు (High Court ) పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ నివాసి 84 ఏళ్ల పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగి, న్యూజెర్సీలో ఉంటున్న తన అల్లుడిపై కేసు నమోదుకు ఎస్‌ఆర్ నగర్ పోలీసుల (SR Nagar Police)కు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేవారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి (Justice Vijay Sen Reddy ) విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో నివాసం ఉంటున్న పిటిషనర్ కుమార్తెను అల్లుడి వేధిస్తున్నాడు. గతంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలోకి చొరబడి తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడంతో చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్నారు.
దీంతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. ఆమె అమెరికాలో అధికారులతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనూ సంప్రదించారు. భారత పౌరురాలిగా జాతీయ మహిళా కమిషన్‌తో పాటు ఇతర మార్గాల్లో రక్షణ పొందే హక్కును ఆమె వినియోగించుకుంటున్నారు అని బదులిచ్చారు. ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడిరచారు. పిటిషన్‌ను కొట్టి వేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులకు ఆదే శాలు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.