వ్యాఖ్యలకు ప్రతిస్పందన

కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెగ్గోసి తెచ్చిన వారికి 1.38 ఎకరాల భూమి ఇస్తానని కాంగ్రెస్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ ‘నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి తన ఆస్తితోపాటు తన తండ్రి ఆస్తిని కూడా రాసిస్తానని ఆఫర్ ప్రకటించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఖానపూర్ చేపట్టిన ఆందోళన సందర్భంగా విలేకరులో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.