తెలంగాణ కేబినెట్ భేటీ .. కీలక నిర్ణయాలు ఇవే

అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించాం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్ చుట్టూ జిల్లాల వారీగా 25 నుంచి 30 ఎకరాల్లో స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ. వంద రోజుల్లో పూర్తి చేయాలని కమిటీకి సూచన. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.